Senior Actress Y. Vijaya interesting comments on Vijayashanthi.'Whenever there are opportunities in the film industry, no one knows when it come, We have to plan something that will give us money' Vijaya Shanti advised me that it was good to shop like shopping complex.
#Y.Vijaya
#Vijayashanthi
#F2movie
#F2comedyscens
#venkatesh
#varuntej
#tamannah
#tollywood
ప్రముఖ నటి వై విజయ చాలా కాలం తర్వాత ఎఫ్2 చిత్రంతో లైమ్‌లైట్ లోకి వచ్చారు. 80, 90 దశకాలలో గయ్యాళి పాత్రలంటే ముందుగా గుర్తుకు వచ్చేది వై విజయనే. అంతగా తన నటనతో విజయ ముద్ర వేశారు. తెలుగు, తమళ, మలయాళీ భాషల్లో వందలాది చిత్రాల్లో వై విజయ నటించింది. 2000 సంవత్సరం ఆరంభం నుంచి వై విజయం చిత్ర పరిశ్రమకు దూరమైంది. అనిల్ రావిపూడి, వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్2 చిత్రంలో మంచి పాత్ర దొరకడంతో మరోమారు ఇండస్ట్రీలో వై విజయ పేరు బాగా వినిపిస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వై విజయ ఆసక్తికర విషయాలని పేర్కొన్నారు.
చిత్ర పరిశ్రమలో ప్రతి నటుడు, నటి విజయం సాధించవచ్చు. కానీ సక్సెస్ ఎప్పటికి మనకే సొంతం కాదు. ఈ విషయం తెలియక చాలా మంది నటులు తాము ఎప్పటికి స్టార్స్ గానే ఉంటామని భ్రమ పడ్డారు. సరైన ప్రణాళిక లేకపోవడంతో అవకాశాలు లేని సమయంలో వారంతా ఆస్తులు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని వై విజయ తెలిపారు. అవకాశాలు లేని సమయంలో సరైన ప్లానింగ్ లేకపోతే రోజు గడవడం కూడా కష్టంగా మారుతుంది.
నేను విజయశాంతితో ఎక్కువ చిత్రాల్లో నటించాను. మా ఇద్దరి మధ్య మంచి అనుభందం ఉంది. విజయశాంతి నన్ను ఎంతగానో అభిమానిస్తుంది. మేమిద్దరం కలసి ట్రావెల్ చేస్తున్న సమయంలో విజయశాంతి నాకు విలువైన సలహా ఇచ్చింది. చిత్ర పరిశ్రమలో ఎప్పుడు అవకాశాలు ఉంటాయో.. ఎప్పుడు ఉండవో ఎవరికీ తెలియదు. మనకు ఎప్పటికి ఆదాయాన్ని అందించేలా ఏదైనా ప్లాన్ చేసుకోవాలి. షాపింగ్ కాంప్లెక్ లాంటిది కట్టుకుంటే మంచిది అని విజయ శాంతి నాకు సలహా ఇచ్చింది.
విజయశాంతి చెప్పిన విషయాన్ని వెంటనే నా భర్తకు చెప్పాను. చెన్నైలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించుకున్నాం. నాకు అవకాశాలు తగ్గిన సమయంలో మా కుటుంబానికి షాపింగ్ కాంప్లెక్స్ నుంచి వచ్చే రెంట్లే జీవనాధారం అయ్యాయి అని వై విజయ చెప్పుకొచ్చింది. విజయశాంతి ఆ రోజు చెప్పిన మాటని నేని పట్టించుకుని ఉండకపోతే మా కుటుంబం మొత్తం చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవాళ్ళం అని అన్నారు.